మీరు ఈ మీటింగ్స్ కి రావాలని అనుకుంటున్నారా అయితే ఇదిగో మీ కోసం ఈ సమాచారం
ఈ మీటింగ్స్ నెల చివరాకరి ఆదివారం జరుగుతుంది.చిన్న పెద్ద అంటూ ఏమి లేదు .మీకు కంప్యూటర్స్ పైన అవగాహన ఉంది విషయ సేఖరణ లో ఆసక్తి గలిగిన వారైన లేదా కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలని జ్ఞాన తృష్ణ ఉన్నా చాలు మీరు ఈ మీటింగ్స్ కి బేషుగ్గా రావొచ్చు.
సమయం- 3 గంటలకు సాయంకాలం
కృష్ణ కాంత్ పార్క్ యూసఫ్-గూడా
మీరు వచ్చే ముందు మెయిల్ చేస్తే మీకు ఏదైనా సమాచారం కావాలంటే అందించడం వీలు పడుతుంది.
మెయిల్ ఐడీ -ceratechies at జిమెయిల్ డాట్ కాం
CEra-ante?
తెలుగులో వెలువడే ప్రముఖ కంప్యూటర్ పత్రిక “కంప్యూటర్ ఏరా” ఈ పత్రిక పాఠకుల కోసం ఈ పత్రిక ఎడిటర్ “శ్రీధర్” గారు కొంత మంది మిత్రులతో ఈ సమావేశాలు రూపకల్పన చేయడం జరిగిందీ.నెలలో పాఠక మిత్రులందరు ఆఖరి ఆదివారం ఒక చోట కలుసుకుని టెక్ కబుర్లు పంచుకునే దిశగా సాగుతున్నాయి ఈ సమావేశాలు.
పత్రిక ప్రచారం నిమిత్తం ఈ మీటింగ్స్ ఎప్పుడు జరగలేదు ఇక ముందు కూడా జరగవు.
ఈ సమావేశాల్లో వీరు వారు అని ఎవరు లేరు.కంప్యూటర్స్ గురించి విషయజ్ఞానం ఉన్నవాళ్లు ,తెలుసుకోవాలని అనుకుంటున్నా వాళ్ళు ఈ సమావేశాలకి రావొచ్చు.
ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతాయి?
కృష్ణకాంత్ పార్క్,యూసఫ్-గూడా లో .
సమయం?
3pm-6pm
పత్రిక రీడర్స్ మాత్రమే రావాలా?
మీరు పత్రిక చదివితే సంతోషం.మీరు ఈ పత్రిక పాఠకులు అయ్యి ఉండనక్కరలేదు.ఈ సమావేశాలు కంప్యూటర్ విజ్ఞానాన్ని పంచుకోవడం కోసమే.
అసలు ఈ మీటింగ్స్ ఎందుకు ?
మన పక్క రాష్ట్రం లోని బెంగలూరు లో చూస్తే శని ఆదివారాల్లో ఎన్నో ఇలాంటి సమావేశాలు జరుగుతాయి.కొన్ని టెక్నాలజీ కి సంబంధించనవి ఐతే కొన్ని కొత్త ఐడీయాలు పంచుకోవడం కోసం.వీటిని “మీట్ -అప్స్” అని అంటారు.ఈ మద్య కొందరు మిత్రులు (బయటి దేశాల నుంచి వచ్చినవారు) అడగడం జరిగిందీ ఏంటి మన హైదరబాద్ లో మీట్-అప్ కాన్సెప్ట్ లేదా అని.ఉన్నాయ్ ఎందుకులేవు -Toastmasters**** లాంటివి కమ్యూనికేషన్ స్కిల్ల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఉన్నాయ్ కాని టెక్నాలజీ,కంప్యూటర్ కి సంబంధించి గ్రూప్స్ దాదాపుగా లేవనే చెప్పొచ్చు.ఇలాంటివి గ్రూప్ మన హైదరాబాద్ లో ఉండాలని అనుకుని ఈ మీటింగ్స్ ని మిగితా మీట్-అప్స్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రతి మీటింగ్ లో కృషి చేయడం జరుగుతుంది.
ఈ మీటింగ్స్ ని ఎవరు నిర్వహిస్తారు?
ఈ మీటింగ్స్ కి రెగ్యులర్ గా వచ్చే మిత్రులే.
ఈ మద్య ఎప్పుడు జరిగిందీ సమావేశం?
మొన్న నవంబర్ ఒకటిన.కృష్ణ కాంత పార్క్ లో.
ఏమి చర్చించడం జరిగిందీ?
విండోస్-7 డెమో ….OS గురించి కొత్త విషయాలు తెలియపరచడం.
ఈ మీటింగ్స్ కి రావాలి అంటే ఎవరిని అడగాలి?
ఈ మీటింగ్స్ గురించి శ్రీధర్ గారు,శ్రీనివాస్ పిరాట్ల-ఇంకా కొందరు మిత్రులు (మరియు నేను) ప్రస్తుతానికి. SMS ద్వార లేదా మెయిల్ ద్వార మీకు సమాచారం పంపించడం జరుగుతుంది .
మీ మెయిల్ ఐ-డీ ?
ceratechies @జిమెయిల్.కాం
బాగుంది ఇంకేమైనా సమాచారం అందిస్తారా?
ఇక్కడ చూడండి www.delicious.com/ceratechies
****
మీటింగ్స్ స్థలం దూరం అని ఆలోచించకండి -ఎందుకంటే మీరు మీటింగ్స్ లో గడిపే రెండు గంటలు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంటుంది,గత మీటింగ్స్ లో కాకుండా ఇకపై జరిగే మీటింగ్స్ లో ఒక సృష్టమైన ఎజెండా ,మీటింగ్స్ లో కొత్త టాపిక్స్ ఉండబొతున్నాయీ
కొత్త వారు రావొచ్చా అని కొందరు అడుగుతున్నారు -ఇక్కడ కొత్త పాత అంటూ ఎవరు లేరండి ,readers వారి మిత్రులు లకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం.
ఆ మీటింగ్స్ వాళ్ళ ఒరిగేది ఏమిటి అనుకోవచ్చు …
కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీరే డిసైడ్ చేసుకోండి
1924 లో ఏర్పడ్డ Toastmasters అనే మీటింగ్ గ్రూప్ ఈ రోజు 92 రెండు దేశాల్లో 230,000 మెంబెర్స్ తో ఇంకా విస్తరిస్తుంది.ఇది ఏ సంస్థో కాదు ,డబ్బు కోసమో,ఇంకో దేనికోసమో నడిచే గ్రూప్ కాదు ,మనలోని కమ్యూనికేషన్ స్కిల్ల్స్ కి సానేబెట్టె ప్రయత్నమే ఈ గ్రూప్ మెంబర్స్ చేస్తారు.మన హైదరాబాద్ లో మొత్తం ౩ clubs ఉన్నాయ్ .ప్రతి సండే కలుస్తారు -౩౦ పైగా మెంబర్స్ హాజరవుతారు ,ఒక ఎజెండా,మీటింగ్స్ TIMETABLE ఖచ్చితంగా పాటిస్తారు .చర్చకు ముందుగానే వారం రోజుల ముందరే టాపిక్స్ డిసైడ్ చేసుకుని దాని ఫై ప్రేపరే అయ్యి వస్స్తారు హాజరయ్యే వారు.దీని వాళ్ళ మాట్లాడేవారికి,వచేవారికి టాపిక్ క్లియర్ గా అర్థమవుతుంది.
మన మీటింగ్స్ లో కూడా మంచి టాపిక్స్ మీద చర్చలు జరగాలి అని అనుకుంటున్నాము.
౨)Ignite అండ్ పేచ కుఛ(pecha kucha) -పేర్లు గమ్మతుగా ఉన్నాయ్ కదూ.
Pecha Kucha -జపాన్ లో యువ భువన నిర్మాణ architects కోసం ,వారిలోని పటిమను బయటికి తీసే presentation ప్రక్ర్రియ.ఈ రోజు 182 దేశాల్లో active మెంబర్స్ ఉన్నారు .
Pecha Kucha is a presentation format in which content can be easily, efficiently and informally shown, usually at a public event designed for that purpose. Under the format, a presenter shows 20 images for 20 seconds apiece, for a total time of 6 minutes, 40 seconds.
It was devised in 2003 by Astrid Klein and Mark Dytham of Tokyo’s Klein-Dytham Architecture (KDa), who sought to give young designers a venue to meet, network, and show their work; and to attract people to SuperDeluxe, the multi-media experimental event space they had set up in Roppongi.
Ignite
Ignite is a style of presentation where participants are given five minutes to speak on a subject accompanied by 20 slides. Each slide is displayed for 15 seconds, and slides are automatically advanced. The first Ignite was held in 2006 in Seattle, Washington, and was sponsored by O’Reilly Media and MAKE magazine.
ఇవన్ని ఎందుకు చెబుతున్నారు అని మీరు నన్ను అడగవచ్చు.మాములుగా స్టార్ట్ అయ్యి దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన మీటింగ్స్ ఎలా స్ప్రెడ్ అయ్యయో చెప్పడానికే.
పైన పేర్కున్న గ్రూప్స్ అన్ని ఓ రెండు నుంచి మూడు గంటలు మీట్ అవుతాయి.ఈ రెండు మూడు గంటల్లోనే చాల విషయాలు చర్చించుకుంటారు..కొత్త వారికి ఓ సెషన్ ఉంటుంది మీటింగ్స్ లో .
మీటింగ్స్ వాళ్ళ సత్ సంబంధాలు ఏర్పడుతాయి .చాల మంది కొత్త ఫ్రెండ్స్ -అది కూడా techinical knowledge ఉన్న వారిని -కెరీర్ పరంగా కూడా ఎంతో లాభదాయకం మన ఈ మీటింగ్స్.
అయ్యో .. ఏంటండి…ఎవైనా చెప్పడం మరిచిపోయారా? అవునండి…తెలుగు సాంకేతిక బ్లాగర్లందరికి విన్నపం.మీరు ఈ మీటింగ్స్ వచ్చి మీ సలహాలు సూచలను ఇవ్వండి.ఈ మీట్-అప్ మన కోసం మన మిత్రుల కోసం.
ఇట్లు పవన్
Like this:
Be the first to like this page.