@Cera మీటింగ్ -అక్టోబర్/నవంబర్-1/2009
రెండు నెలల తరువాత మళ్లీ కే కే పార్క్(కృష్ణ కాంత్ పార్క్),యూసుఫ్-గూడా లో కంప్యూటర్ మిత్రబృందం మళ్ళి కలవడం జరిగిందీ.కొన్ని పాత మొహాలు -ఇందులో నేను ఉన్నాను అనుకోండి.మొత్తానికి ఓ పదిహైదు జనం.
ఈ సారి సమావేశం మొత్తం ఈ ఒక టాపిక్ చర్చించడమే జరిగిందీ. శ్రీధర్ గారు “విండోస్-7″ ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన OS లో స్టేబుల్ ఓస్ అని చెబుతూ,16 GB హార్డ్ డిస్క్ స్పేస్ అవసరమని చెప్పారు. ఈ సమావేశం లో విండోస్ -7 గురించి విపులంగా చర్చించాము.నేను అక్కడక్కడ కొత్త విస్టా,xp కి మరియు ఈ కొత్త OS కి తేడాలు మరియు కొన్ని ప్రొడక్టివిటీ features గురించి సమాచారం అందించాను. ఆ తరువాత శ్రీధర్ గారు Windows-7 డెమో తన దగ్గర ఉన్న లాప్ టాప్ లో ఇచ్చారు.
ఈ సమావేశం లో చర్చించిన అంశాలు విషయాలు మీ కోసం (అదనపు సమాచారం మరియు లంకెలు)
నేను అనుకున్న టాపిక్ వచ్చే మీటింగ్ కి వాయిదా వేయడం జరిగింది.కొత్త మిత్రుల్లో ఉత్సాహం-ఈ ఉత్సాహాన్ని ఇలానే కాపాడుకుని వచ్చే మీటింగ్స్ లో వారి మిత్రులతో వస్తారని ఆశిస్తూ….
~~పవన్~~