Feeds:
Posts
Comments

Archive for June, 2009

మే cera పాఠకుల మీటింగ్ చాల బాగా జరిగిందీ.మొత్తం 25గురు cera పాఠకులు హాజరయ్యారు.విశేషం ఏంటంటే మీటింగ్ కి అనంతపూర్,ఖమ్మం నుంచి రీడర్ మిత్రులు విచ్చేశారు.ఈ సారి మీటింగ్స్ లో సృష్టమైన టాపిక్స్ వాటి మీద చర్చ ఉండబోతుంది అని గత మీటింగ్ లో చెప్పడం జరిగిందీ -ఈ విషయమే మన మిత్రులకు ఫోరం ద్వార చేరవేయడం జరిగిందీ.కాని పని వత్తిడిలో టాపిక్స్ ఫై సమాచారం సేకరించడం  వీలు చిక్కలేదు.టాపిక్స్ ఫై ఓ గంటలో నెట్ లో సమాచారం సేకరించి,లాప్ టాప్ లో ఇదివరకే సేకరించిన  సమచారినికి జోడించి onenote(MS onenote) లో భద్రపరుచుకుని వెళ్ళాను.టీవీ లో తీరాన్ని చేరిన రుతుపవనాలు అన్న వార్త ,ఎక్కడ వర్షం పడుతుందా?అన్న సందేహం తో కృష్ణ కాంత్ పార్క్ వైపు బైక్ ని పరుగులెత్తించాను.

30ని లో కృష్ణ కాంత్ పార్క్ చేరుకున్నాను.శ్రీధర్ గారితోపాటు ఇంకొందరు రెగ్యులర్ cera మిత్రులు (చదేర్ఘాట్ శ్రీనివాస్ గారు,శ్రీనివాస్ పిరాట్ల,పట్టాభి గారు) అక్కడ కనిపించారు.ఎప్పుడు కూర్చునే రెగ్యులర్ ప్లేస్ కాకుండా ఇంకాస్త ముందుకెళ్ళి కూర్చున్నాము.మీటింగ్ లో డిస్కస్ చేసే టాపిక్స్ printouts ని శ్రీధర్ గారు అందరికి పంచారు.ఒకరిద్దరు పాఠకులు మొదటిసారి రావడం వాళ్ళ కాస్త ఆలస్యమైనా మీటింగ్ ప్లేస్ చేరుకున్నారు.
మొదటగా పరిచయాలతో ప్రారంభించాం.తర్వాత నేను మొదటి టాపిక్”గూగుల్ సెర్చ్ కాకుండా ఇతర సెర్చ్ ఇంజన్స్”
ఈ టాపిక్ ఫై మాట్లాడుతూ నేను  రీడర్ మిత్రులకు కొన్ని సెర్చ్ ఇంజన్స్ పరిచయం చేసాను .వాటి లింక్స్ క్రింద చూడొచ్చు

విజుయల్ సర్చ్ ఇంజన్స్

Cooliris

SearchMe

Viewzi

సర్చ్ ఇంజన్స్

Quintura
Kosmix
Download Any Stuff

VideoSurf
Docjax

Yahoo Glue

Search.io

మెటా సర్చ్ ఇంజన్స్

Clusty

Dogpile

Mamma

Zuula

InfoGrid

http://www.infogrid.com

Ithaki

http://www.ithaki.net/indexu.htm

IxQuick

http://www.ixquick.com/

Kartoo

http://www.kartoo.com

SurfWax

http://www.surfwax.com

Vivisimo

http://vivisimo.com/

టాపిక్స్ మధ్యలో సందేహాలు,తెలియని సమాచారాన్ని పేపర్స్ ,మొబైల్స్ లో నోట్ చేసుకుంటూ మన మిత్రులు కనిపించారు .మొదటి టాపిక్ మంచి డిస్కషన్ తో ముగిసిన తరువాత కొన్ని స్క్రీన్ షాట్స్ చూపించాను నా లాప్టాప్ లో .

ఇంతలో లో రెగ్యులర్ గా రీడర్ మీటింగ్స్ కి వచ్చే మిత్రుడు భాను ప్రతాప్ గారు ఉబుంటు 9.04 సీడీ లు కొన్ని (21)పంచారు.ఉబుంటు గురించి స్క్రీన్ షాట్స్ తో సహా నేను ఏప్రిల్ మీటింగ్ లో చర్చిండం జరిగిందీ .రీడర్ మితులకు లినక్సు-ఉబుంటు 9.04 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిచయం చేసాను.ఆ తరువాత కొంత సేపు చర్చ తరువాత   మీటింగ్ ఫొటోస్ ని మిత్రులు సాయి గారు,శ్రీధర్ గారు,శ్రీనివాస్ పిరాట్ల గారు కెమెరా లో బంధించారు.

టాపిక్ -2 లో చర్చకు వచ్చిన అంశం-“గూగుల్ సెర్చ్ చిట్కాలు “

define,related,site,inurl,insite,గూగుల్ లో maths చిట్కాలు,మనకు కావాల్సిన డాకుమెంట్స్ ని త్వరగా సర్చ్ చేయడానికి వాడాల్సిన కొన్ని సెర్చ్ టిప్స్ (filetype:pdf) లాంటి వాటిని మిత్రులకు పరిచయంచేయడం జరిగిందీ.
డిస్కస్ చేసిన టిప్స్ అండ్ ట్రిక్స్ కి క్రింద లింక్స్ ఇచ్చాను చూడండి.

గూగుల్ చిట్కాలు ౧

గూగుల్ చిట్కాలు ౨
మూడో టాపిక్ మొదలు పెట్టె ముందు వర్షం భోరున కురియడం వల్ల పక్కనే ఉన్న కుటీరం లోకి పరుగుతీసాం.
బయట వాతావరణం చల్ల బడింది .మిత్రులు పాత కొత్త అంత మొబైల్ నంబెర్స్ మార్చుకుంటూ,సందేహాలను తీరుస్తూ,కొత్త మిత్రులను పరిచయం చేసుకుంటూ కనిపించారు.
వర్షం కాస్త తగ్గాక కాంటీన్ వెళ్లి వేడి వేడి బజ్జిలూ,పకోడీ లు లాగించి నెక్స్ట్ మీటింగ్ కి టాపిక్స్ కూడా డిసైడ్ చేయడం జరిగిందీ.
చివరగా హిమాయత్ నగర్ నుంచి వచ్చిన మిత్రులు మణికంఠ గారు మీటింగ్ చాల బాగా జరిగిందీ అని సంతోషం వ్యక్తపరుస్తూ ఇలాంటి మీటింగ్స్ ఇచ్చే కిక్ చాల బాగుంది అని అన్నారు.
అందరి మొహాల్లో అదో తెలియని సంతోషం ,ఆనందం.
పేరు పేరున ఈ మీటింగ్ కి హాజరైన అందరికి  ధన్యవాదాలు.
వచ్చే మీటింగ్ కి మీరు మీ మిత్రులతో తప్పక వస్తారని ఆశిస్తూ…..

మా cera రీడర్స్ మీటింగ్స్ లో మీరు పాల్గొనాలని అనుకుంటే ఎందుకు ఆలస్యం…
ఫోరం లో రిజిస్టర్ అవండి -రిజిస్ట్రేషన్ ఫ్రీ

www.computerera.co.in/forum

లేదా క్రింద ఉన్న మెయిల్ ఐడీ కి మెయిల్ చేయండి

Cera

Cera


నెల ఆఖరి ఆదివారం 28th న మిమ్మల్ని మళ్ళి కలుస్తాము(june -28th)

~~పవన్ మారెడ్డి~~


Read Full Post »